-->

Sagedha nenu yesunilo sramayaina karuvaina సాగెద నేను యేసునిలో శ్రమయైన కరువైనా

Lalitha
Song no:

సాగెద నేను యేసునిలో - శ్రమయైన కరువైనా 
కృంగిపోను ఏనాడు - కొదువ లేదు నా యేసులో 
యేసు నాతో ఉంటే -నాకు సంతోషమే 
యేసు నాలో ఉంటే - నాకు సమాధానమే . . . 

1. తన రూపములో నను చేసికొని - తన రక్తముతో పరిశుద్ధ పరచి 
నూతన క్రియలు నాలో చేసి - నా దోషములను క్షమించిన 

2. తన రాజ్యములో నను చేర్చుకొని - పరిశుద్ధాత్మతో - అభిషేకమిచ్చి 
పర్వతములు తొలగిపోయిన - భయపడకు అని వాగ్ధానమిచ్చిన
Share:

Ninna nade repu marani devudu neevu నిన్న నేడు రేపు మారని దేవుడు నీవు

John wesly
Song no:

నిన్న నేడు రేపు మారని దేవుడు నీవు  || 2 ||
మనుషులు మారిన మమతల తరిగిన
మార్పులేని దేవుడు నీవ్ . . || 2 ||

1. అబ్రహామును పిలిచావు యాకోబును దర్శించావు
తరగని ప్రేమతో కృపతో నింపి మెండుగా దీవించావు
ఈనాటికైనా ఏనాటికైనా మార్పులేని దేవుడు నీవు . .

2. యోసేపును హెచ్చించావు దావీదును ప్రేమించావు
శ్రమలోనైనా ధైర్యము నింపి సర్వము సమకూర్చావు
ఈనాటికైనా, ఏనాటికైనా మార్పులేని దేవుడు నీవు . .

3. జీవపు మార్గము చూపించి ఆశ్రయ పురముకు నడిపించి
నీ దయ నాపై కురిపించి నెమ్మది కలిగించావు
ఈనాటికైనా, ఏనాటికైనా మార్పులేని దేవుడు నీవు . . 
Share:

Bahuga bahu bahu bahuga nanu dhininchinu బహుగా బహు బహు బహుగా నను దీవించెను


Song no: o

బహుగా బహు బహు బహుగా
నను దీవించెను-తన కృపలోన
నన్ను దాచియుంచెను     " 2 "
తన మహిమతో  నాతో  మాట్లాడును 
అరచేతిలో నన్ను చెక్కియుంచెను 
విడువని దేవుడు నన్నెన్నడు ఎడబాయడు 
                                          " బహుగా "

నా యెడల నీ తలంపులు విస్తరములు
అవి లెక్కించిన లెక్కకు మించియున్నవి 
నా పాప బ్రతుకంతా జ్ఞాపకము చేసికొనక 
నీ సాక్షిగా నన్ను నిలువబెట్టినవయ్యా  " 2 "
అబ్రాహాము దేవుడవు-అద్వితీయుడవు నీవు 
అందరికి ప్రభువైనఆదరణ కర్తవు 
ఏమని పాడెదను నీ శాశ్వత ప్రేమకై 
ఏమని చాటెదను నీ నిత్యమైన కృపకై
                                        " బహుగా "

నాతల్లి గర్భమందే నన్ను ప్రతిష్టించితివి 
నీకొసమే నన్ను ఏర్పరుచుకుంటివి 
నా మట్టుకు బ్రతుకు క్రీస్తు చావైతే లాభమే 
నీకోసమే నేను సైనికుడనైతిని   " 2 "
నా దేవ దేవుడవు-నా ప్రాణ ప్రియుడవు 
నరులందరి ప్రభువైనన్యాయాధిపతి నీవు
ఏమని పాడెదను నీ శాశ్వత ప్రేమకై
ఏమని చాటెదను నీ నిత్యమైన కృపకై

                                      "  బహుగా "
Share:

Sundharamaina dhehalenno shidhilamu kaledha సుందరమైన దేహాలెన్నో శిథిలము కాలేదా

John wesly
Song no:
సుందరమైన దేహాలెన్నో శిథిలము కాలేదా?
అంబరామాంటిన రాజులెందరో అలసిపోలేదా ?
కలములు పట్టిన కవులు ఎందరో కనుమరుగవలేదా?
ధరణిలోన ధనికులెల్లరు దహనం కాలేదా?
ఏది శాశ్వతం కాదేదీ శాశ్వతం
తరచి చూడుము పరికించి చూడుము “2” “సుందరమైన”

నెత్తుటి చారలను లికించిన రాజులెందరో
ఆ నెత్తుటిలోనే ప్రాణాలు విడచిపోయారు
అదికారా దహముతో మదమెక్కిన వీరులు
సమడి లోతుల్లోనే మూగబోయారు “2”
తపోబలము పొందిన ఋషులందరూ
మతాదికారులు మటాదిపతులు
ఈ కాల గర్బములోనే కలసిపోయారు
మరణ పిడికిళ్ళలో బందిలయ్యారు  “ఈ కాల”

యేసు లేని జీవితం వాడబారిన చరితం  “2”
క్రీస్తు ఉన్న జీవితం భూవిలో  చరితార్దం  “2” సుందరమైన”

ప్రాణం పోసిన దైవాన్ని కాదంటే
ఆ జీవితానికి పరమార్దం ఉంటుందా
పాప సంకేళ్లలో బందీలైన వారికి
ఆ దివ్య మోక్షం చేరుకునే భాగ్యం ఉంటుందా ? “ప్రాణం పోసిన”

శరీరాన్ని విడచిన మనుష్య ఆత్మకు
మరో జీవితం లేదనుట భావ్యమా
రక్తము కార్చిన యేసును విస్మరించి
ఈ సృష్టిని పూజించుట మనిషికి న్యాయమా?  “2”

యేసు లేని జీవితం అంధకార బంధురం
క్రీస్తు ఉన్న జీవితం తేజోమయ మందిరం “2” “సుందరమైన”
Share:

Neeve naa rakshana neeve nirikshana నీవే నా రక్షణ నీవే నిరీక్షణ నీవే నా దీవెన


Song no:

నీవే నా రక్షణ – నీవే నిరీక్షణ
నీవే నా దీవెన – నీవే క్షమాపణ (2)
యేసయ్యా యేసయ్యా ఎంత మంచివాడవయ్యా
యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా (2)||నీవే నా||

గతమును మన్నించి గుణవంతునిగా చేసి
నన్ను మలచి నన్నే మరిపించి (2)
మనిషిగా మార్చినావు
నీ మనసు నాకిచ్చినావు (2)||యేసయ్యా||

కన్నీరు తుడచి కష్టాలు తీర్చి
అండగ నిలిచి అడ్డులన్ని తొలగించి (2)
మనిషిగా మార్చినావు
మాదిరిగ చేసినావు (2) ||యేసయ్యా||
Share:

Yenthati vadanu nenu yesayya konthaina yigyudanu kanayya ఎంతటి వాడను నేను యేసయ్యా కొంతైనా యోగ్యుడను


Song no:

ఎంతటి వాడను నేను యేసయ్యా
కొంతైనా యోగ్యుడను కానయ్యా (2)
ఇంతగ నను హెచ్చించుటకు
ఈ స్థితిలో నన్నుంచుటకు (2)||ఎంతటి||

ఐశ్వర్యము గొప్పతనమును
కలిగించు దేవుడవీవే
హెచ్చించువాడవును
బలమిచ్చువాడవు నీవే (2)
అల్పుడను మంటి పురుగును
నన్ను ప్రేమించినావు
ప్రాణమును నీ సర్వమును
నా కొరకై అర్పించినావు ||ఎంతటి||

నిను వెంబడించువారిని
నిజముగ సేవించువారిని
నీవుండే స్థలములలో
నిలిచే నీ సేవకుని (2)
ఎంతో ఘనపరచెదవు
ఆశీర్వదించెదవు
శత్రువుల కంటె ఎత్తుగా
అతని తలను పైకెత్తెదవు ||ఎంతటి||

వినయముగల మనుష్యులను
వర్దిల్లజేసెదవు
గర్విష్టుల గర్వమునణచి
గద్దె నుండి దించెదవు (2)
మాదు ఆశ్రయ దుర్గమా
మేమంతా నీ వారమే
మా శైలము మా కేడెమా
మాకున్నదంతా నీ దానమే ||ఎంతటి||
Share:

Yentha goppa vadivaina chivariki budidhega ఎంత గొప్ప వాడివైన చివరికి బుడిదేగా


Song no:
ఎంత గొప్ప వాడివైన చివరికి బుడిదేగా
ఎంత గొప్ప పేరు ఉన్న
చివరి పేరుశవమేగా.                        ." 2 "
కులమైన మతమైన
రంగైనా జాతైనా చనిపోతాము
అందరు చివరికి మిగిలేది ఎవ్వరు.     " 2 "

అను . పల్లవి ÷ నిన్ను నీవు మరచి
తెలుసుకోరా మనిషి.      " 2 "

కడుపులో పెట్టి పేంచుకున్న నీ తల్లి
కళ్ళలో పెట్టి చుచుకునే నీ తండ్రి.  "2"
ప్రేమను చూపుతారు ప్రాణం పెట్టలేరూరా "2"
నీకై ప్రాణం పెట్టినవారు యేసయ్యరా
నా యేసయ్యేరా              "నిన్ను నీవు"

ఎప్పుడు చనిపోతామో తెలియదురా
చివరికి చావే తోడని తెలుసును రా "2"
మరణమును రుచి చూడక
బ్రతికుండే నరుడు ఎవరురా.         "2"
ఉన్నపాటునే యేసయ్యను సేవించేరా
యేసుని ప్రేమించరా           "నిన్ను నీవు"

అంతలో కనబడి అంతలో మాయం జీవం
నీటి బుడగను పోలి ఉన్నది నీ ప్రాణం  "2"
రేపు ఏమి జరుగునో ఎవ్వరికి తెలుసురా "2"
రోజే నీ హృదయంలో చోటివ్వరా

యేసుకి చోటివారా.          "నిన్ను నీవు"
Share:

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Subscribe Us

Comments

Technology

Latest Posts

Recent Posts