Yehova naa shailama Lyrics


యెహోవా నా శైలమా - నను రక్షించు దైవమా
నా కేడెమా - రక్షణ శృంగమా - నా ఉన్నత దుర్గమా
1. పాతాళ పాశములు అరికట్టగా
శత్రువులు మీదపడి బెదిరింపగా
నా శ్రమలో నీకు మొరపెట్టగా
నను నీవే రక్షించితివి
2. యధార్ధమార్గమున నడిపించుచు
ఎత్తైన స్థలములపై నను నిలిపుచు
నా చేతులకు యుద్దము నేర్పుచు
నను నీవే ఆదుకొంటివి
3. నా దీపమును నీవే వెలిగించుచు
నా చీకటిని వెలుగుగా చేయుచు
ప్రాకారములు నాతో దాటించుచు
నను నీవే గెలిపించితివి


Alpamaina vadavani ye mathram bhayapadaku Lyrics


అల్పమైనవాడవని ఏమాత్రం భయపడకు
 నిరాశకు తావీయకు
పురుగునైనా మ్రానులాగా మార్చగలడు - నా యేసయ్యా
1. ఓడిపోయియున్న నిను చూస్తాడు యేసు
వాడి రాలుచున్న సరిచేస్తాడు
 కార్యం నీ ద్వారా జరిగిస్తాడు
శ్రేష్టమగు దీవెనగా మార్చగలడు నా యేసయ్యా
2. పగిలిపోయియున్న నిను చూస్తాను యేసు
చితికి బ్రతుకుతున్నా సరిచేస్తాడు యేసు
స్తుతులు నీ ద్వారా పలికిస్తాడు యేసు
యోగ్యమగు పాత్రనుగా మార్చగలడు నా యేసయ్యా
3.శ్రమతో నలిగియున్న నిను చూస్తాడు యేసు
భ్రమలో బ్రతుకుతున్నా సరిచేస్తాడు యేసు
ధరణి నీ ద్వారా వెలిగిస్తాడు యేసు
దివ్యమగు రూపముగా మార్చగలడు నా యేసయ్యా


Ninnenthagano preminchina yesayyanu neevu నిన్నెంతగానో ప్రేమించిన యేసయ్యను నీవు ప్రేమించకుంటివా

Song no:
HD
    నిన్నెంతగానో ప్రేమించిన
    యేసయ్యను నీవు ప్రేమించుచుంటివా } 2
    కడువింతగాను హెచ్చించిన
    నీ తండ్రిని నీవు హెచ్చించుచుంటివా } 2 || నిన్నెంతగానో ||

  1. నిరుపయోగమైన లోకము నుండి
    వాక్యముతో బయటకు లాగబడితివే } 2
    కడవరకు నిను కోరుకున్న - పరలోకము నిను చేర్చనున్న } 2
    యేసయ్యను నీవు ప్రేమించుచుంటివా
    నీ తండ్రిని నీవు హెచ్చించుచుంటివా || నిన్నెంతగానో ||

  2. ఎంతో విలువైన రక్తము ద్వారా
    శుద్ధుడవై సంఘములో చేర్చబడితివే } 2
    తనను తాను అర్పించుకున్న - తనకై నిను విమోచించుకున్ } 2న
    యేసయ్యను నీవు ప్రేమించుచుంటివా
    నీ తండ్రిని నీవు హెచ్చించుచుంటివా || నిన్నెంతగానో ||

Mora pettu samayamidhi Lyrics


మొరపెట్టు సమయమిది విలపించు తరుణమిది
విజ్ఞాపనము చేసే బాధ్యత మనకున్నది
అ.ప: ప్రార్ధించెదం ప్రార్ధించెదం భారముతో ప్రార్ధించెదం
1 గొప్ప ఉజ్జీవమును ఆత్మకుమ్మరింపును
మన తరమునందే ఈ కాలమందే
జరిగించుమని దేవుని అడిగెదం
2 దేశం పాడవకుండగా ప్రాకారం బలపడగా
దేవునిఉగ్రతను తప్పించుకొనగా
బ్రద్దలైన సందులో నిలిపెదం
3 అపవాదికార్యములు బంధించి జయమొందగా
ప్రేమ ఐక్యతతో దేవుని సైన్యముగా
పోరాటం చేయుటకు కలిచెదం
4 దేశం స్వస్థతపొందగా పాపం క్షేమించబడగా
ప్రజలందరికిని రక్షణ కలుగగా
తగ్గించుకొని దేవుని వెదకెదం


Hethuvemi leka poyuna Lyrics


హేతువేమి లేకపోయున నన్ను ప్రేమించిన యేసయ్యా
నేను కోరుకోకపోయునా స్నేహించిన మనసు నీదయా
ఆదరించిన మమతపంచిన దేవా నిను విడిచిపోనయా
1. మహా ఎండకు కాలిన అరణ్యములో నేనుండగా
సహాయమునకై చూచిన ఫలితమేమి లేకయుండగా
నా స్థితి గమనించి - ఈ దీనుని కరుణించి
2. ప్రమాదపు చివరి అంచున కాలుమోపి నేనుండగా
సమాధాన సరోవరమున కల్లోలము లేకయుండగా
నీ చేయు అందించి - కీడునుండి తప్పించి
3. భలాడ్యులు చుట్టుముట్టిన యుద్ధములో నేనుండగా
విలాపమువల్ల కృంగిన పరిస్థితి సాగుచుండగా
నా పక్షము వహియుంచి - పోరాటము జరిగించి


Neekanna lokana nakevarunnarayya Lyrics


నీకన్నా లోకాన నాకెవరున్నరయ్యా
 నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా
1. నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా
ప్రాణం బెట్టిన దేవుడవు నీవే యేసయ్యా
2. నీలా బోధించేవారు ఎవరున్నారయ్యా
జీవం ఉన్న దేవుడవు నీవే యేసయ్యా
3. నీలా రక్షించేవారు ఎవరున్నారయ్యా
రక్తం కార్చిన దేవుడవు నీవే యేసయ్యా
4. నీలా పోషించేవారు ఎవరున్నారయ్యా
అన్నీ తెలిసిన దేవుడవు నీవే యేసయ్యా


O karuna shiluda stuthiyumthunu Lyrics


ఓ కరుణశీలుడా స్తుతియుంతును
నా హృదయనాధుడా భజియుంతును
నీ ఘనత నేను ప్రకటింతును
అ.ప : సహాయుడా నీకే ఆరాధన
సజీవుడా నీకే ఆరాధన
1. నాపై యెహోవా దయకలిగి నీవే
నా పర్వతాన్ని స్థిరపరచినావే
మొరపెట్టగా స్వస్థపరచి కలిగించితివి క్షేమం
2. నీ ముఖముదాచిన కలతచెంది నేను
మొరపెట్టి నిన్ను బ్రతిమాలినను
నీ కోపము నిమిషమాత్రం దయనిలుచు నిరంతరం
3. నా అంగలార్పును నాట్యముగ మార్చావు
సంతోష వస్త్రము ధరియుంపచేశావు
ఏడ్పువచ్చి రాత్రియున్న ఉదయమున సంతోషం