Krupamaya ninne aradhisthunna కృపామయ నిన్నే ఆరాధిస్తున్న కృపలో నిత్యము ఆనందిస్తున్న


Song no:
కృపామయ నిన్నే ఆరాధిస్తున్న
కృపలో నిత్యము ఆనందిస్తున్న
కృపామయ నా యేసయ్య
దయామయ దీనదయా

ఆకాశములు భూమికి పైన
ఎంత ఎతైనవో
నా యేడల నీ తలంపులు
అంత ఎతైనవి

నా రక్షణకు నిరీక్షణకు
ఆదారమై యున్నది
నే జీవించుటకు ఫలియించుటకు
మూలమైయున్నది

బలహీనతలో బలముతో నింపి
నడిపించే కృప
శ్రమలో విడిపించి గొప్పచేసి
తృప్తి పరచె కృప

Stuthi geethame padana sthuthi aradhana cheyana స్తుతి గీతమే పాడనా స్తుతి ఆరాధన చేయనా


Song no:
స్తుతి గీతమే పాడనా
స్తుతి ఆరాధన చేయనా
శ్రీమంతుడవగు షాలేము రాజుకు

బలియు అర్పణ అక్కరలేదని
కనికరమునే కోరువాడవని
విరిగిన మనస్సును
నలిగిన హృదయమును
అలక్ష్యము చేయని నాప్రియునికి

మహిమాన్వితుడవు మహోన్నతుడవు
పరిశుద్ధ స్థలములోనె నివసించువాడవు
కృపా సత్య సంపూర్ణునిగా
మా మద్యనివసించుటకు
మాకై అరుదెంచిన మా ప్రభునకు

Nuvve lekapothey nenemaipodhuno నువ్వే లేకపోతే నేనేమైపోదునో నువ్వే రాకపోతే నేనెక్కడ వుందునో


Song no:
నువ్వే లేకపోతే నేనేమైపోదునో
నువ్వే రాకపోతే నేనెక్కడ వుందునో
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా

నీ శక్తితో నింపు నీ బలముతో నింపు
బహు ప్రజలను
నీకై నే సంపాదించుటకు

ఆత్మతో నింపు అభిషేకముతో నింపు
నశియించే నీ ప్రజలను
నీలో నడుపుటకు

ప్రేమతో నింపు నీ జీవముతో నింపు
అనుదినము నిన్ను నే
స్తుతియించుట కొరకు

Yesu neetho naa jeevitham యేసు నీతో నా జీవితం ఎల్ల వేళలందు ఆనందమే


Song no: 55
యేసు నీతో నా జీవితం
ఎల్ల వేళలందు ఆనందమే
ఆరాధింతును అనుదినము
ప్రణుతింతును ప్రతి దినము

రాజుల రాజువని ప్రభువుల ప్రభువని
నీవు లేక ఏది కలుగలేదని
కీర్తింతును నిను కొనియాడెదన్ ద్యానింతును నీలో దినదినము

సర్వోన్నతుడని
సర్వశక్తి మంతుడవని
సమస్తానికి ఆదారము నీవని
పూజింతును నిను ఘనపరచెదన్
జీవింతును నీకై ప్రతిదినము

Madhuramaina nee prema మధురమైన నీ ప్రేమా మరపురాని కరుణా కురిపించితివి


Song no: 56
మధురమైన నీ ప్రేమా
మరపురాని కరుణా
కురిపించితివి నీ కృప నాపై
మరిపించితివి ఈ లోక ప్రేమ

పలువురు నన్నుచూచి పరిహసించినా
పదివేల మంది నాపై పడివచ్చినా
పదిలముగానే ఉండేదనయా
పరిశుద్ధుడా యేసు నీ సన్నిధిలో

నాకున్నవారే నిందించినా
నాకయినవారే నన్ను విడిచినా
విడువలేదు నన్ను మరువలేదు నీవు
మరపురానిదే నీ దివ్య ప్రేమ

నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే
చావైన నాకు ఎంతో మేలు
చనిపోవు చుంటిని
దిన దినము నాలో
జీవించుచుంటిని
సిలువ ప్రేమ నీడలో

Nee prema naku yentho madhuramainadhi నీ ప్రేమ నాకు ఎంతో మధురమైనది నీ ప్రేమ నాకు ఎంతో శ్రేష్టమైనది


Song no: 58
నీ ప్రేమ నాకు ఎంతో మధురమైనది
నీ ప్రేమ నాకు ఎంతో శ్రేష్టమైనది
మధురమైనది నీ ప్రేమ
మరపురానిది నీ ప్రేమ

భయపడగా నే కృంగి యుండగా
పడియుండగా నే చేడి యుండగా
చెంత చేరినది నీ ప్రేమ
చేర దీసినది నీ ప్రేమ

నిను విడిచి నే దూరమవ్వగా
వ్యర్ధమైనది నే కోరుకొనగా
వెంబడించినది నీ ప్రేమ
నన్ను మార్చినది నీ ప్రేమ

Sarvyadhi kariyaina devudu సర్వాధి కారియైన దేవుడు సమస్తము ఎరిగియున్న దేవుడు


Song no: 57
సర్వాధి కారియైన దేవుడు సమస్తము ఎరిగియున్న దేవుడు
సమృద్ధిగిచ్చువాడు సంతోషమిచ్చువాడు
సకలము తెలుసు నా యేసుకే
సర్వము సాధ్యము నా యేసుకే

సృష్టికి రూపమే లేనప్పుడు
శూన్యములో నుండి సృష్టిని తీశాడు
సృష్టికి ఆకారము నిచ్చాడు దేవుడు
సృష్టికి అందాలను ఇచ్చాడు దేవుడు

సృష్టిలో మానవునీ పెట్టాడు
తన పోలిక రూపమును ఇచ్చాడు
ఫలియించి అభివృద్ధి
చెందమని చెప్పాడు
ఈ సృష్టినంత మీరే
ఏలమని అన్నాడు