Nijamaina dhraksha valli neeve నిజమైన ద్రాక్షవల్లి నీవె నా యేసయ్యా


Song no: 62
నిజమైన ద్రాక్షవల్లి నీవె
నా యేసయ్యా
నా మంచి వ్యవసాయకుడు
నీవె నా తండ్రి
నీలోన నేను ఫలియించాలని
నీ కొరకు నేను ఇలలో జీవించాలని
ఆశ అయితే నాలో వుందయా

యజమానుడా నా యేసయ్యా

నాలోన నీవు నీలో నా జీవితం
నాయందు నీ మాటలు
ఫలియించునపుడు
అడుగువాటి కంటెను
ఊహించు వాటి కంటెను
అడుగకనె అక్కర తీర్చీతివే

నీవుండు స్థలములో నేనుండులాగున
నా కొరకు స్థలమును సిద్ధపరచితివి
నా కొరకై నీవు రానైయుంటివి
నీ రాజ్యమందు నను చేర్చెదవే

Stuthiyinchalani keerthinchalani స్తుతియించాలని కీర్తించాలని అనుదినము నిన్నే


Song no: 60
స్తుతియించాలని కీర్తించాలని
అనుదినము నిన్నే...నా...యేసయ్యా
అనుక్షణము నిన్నే...నా... యేసయ్యా

భూమియందంత ప్రభావము గలది
ఆకాశమంత ఉన్నతమైనది
భూజనులందరిలో శ్రేష్టమైనది
మరపురానిది నీ మధుర నామము

మనుష్యులలోనె మహానీయుడవు
వేల్పులలోనె ఘనపూజ్యుడవు
ఆరాధనకు యోగ్యుడా నీవు
అతికాంక్షనీయుడా అద్వితీయుడా

జీవితమంత నీ నామమునె
స్తుతియించెదను నా యేసయ్యా
ఆశ్చర్యకరుడవు నీవెనని
ప్రకటించెదను ప్రణుతించెదను

Sajivuda nee rekkalalo సజీవుడా నీ రెక్కలలో నన్ను దాచి కాచి కాపాడావు


Song no: 63
సజీవుడా నీ రెక్కలలో
నన్ను దాచి కాచి కాపాడావు
సర్వోన్నత నీదు ఒడిలో
నన్ను లాలించి ఓదార్చావు

నీ నామమే నాకు ఆశ్రయమాయె
నీ హస్తమే నాకు స్వస్థత నిచ్చె
నీ నామమే నా రక్షణ ఆధారము

నీ వాక్యమే నాకు దీపమాయెను
అనుదినము జీవాహారమాయెను
నీ వాక్యమే నా నిరీక్షణకాధారము

నీ సన్నిధియే నాకు పెన్నిదాయెను
నీ మాటలే నాకు ప్రాణమాయెను
నా ప్రాణము నీవిచ్చిన కృపాదానమే

Parisuddhudavai mahima prabhavamulaku పరిశుద్ధుడవై మహిమప్రభావములకు నీవే పాత్రుడవు బలవంతుడవై


Song no:
పరిశుద్ధుడవై మహిమప్రభావములకు - నీవే పాత్రుడవు - బలవంతుడవై - దీనుల పక్షమై కృప చూపువాడవు - దయాలుడవై ధారాలముగా నను దీవించిన శ్రీమంతుడా
ఆరాధన నీకే నా యేసయ్య -2

1. నీ స్వాస్థ్యమైన నీవారితో కలిసి - నిను సేవించుటకు
నీ మహిమ ప్రభావమును - కిరీటముగా - ధరింపజేసితివి.
శాశ్వత కాలము వరకు నీ సంగతిపై దృష్టి నిలిపి నీ దాసుల ప్రార్ధనలు సఫలపరచితివి.
                              "ఆరాధన"

2. నీనిత్యమైన ఆదరణ చూపి నను స్థిరపరచుటకు
నీ కరుణకటాక్షమును నాపై కురిపించి నను ప్రేమించితివి
నాకు ప్రయోజనము కలుగజేయుటకు నీ ఉపదేశమును బోధించి
నీ దాసుని ప్రాణమును సంతోషపరచితివి.
                            "ఆరాధన"

3. ఆనందకరమైన దేశములో నేను - నిను ఘనపరచుటకు
నీ మహిమాత్మతో నింపి  సురక్షితముగా నన్ను నివసింపజేసితివి 2
మేఘవాహనుడవై వచ్చువరకు నే కనిపెట్టుచుందును నీ కోసము - నీ దాసుల కాంక్షను సంపూర్ణపరచెదను.
                               "ఆరాధన"

Prabhuva nee melulu ప్రభువా నీ మేలులు నా యెడల విస్తారములు


Song no: 64
ప్రభువా నీ మేలులు
నా యెడల విస్తారములు
లెక్కించి వివరించెద ననుకొంటినా
నాజీవిత కాలం సరిపోదయ్యా

నీ మేలులు తలపోసెదా
నీ మేలులు వివరించెదా

నీ చేతి కార్యములు తలంచగా
ఆశ్చర్యం కలిగెను నాలో తలంచగా
భూమ్యాకాశముల్ నీ చేతి పనులే
సముద్ర జలచరముల్
నీదు కార్యాములే

నీవు నన్ను కలుగజేసిన
విధమును చూడగా
భయము పుట్టెను నాలో ఆశ్చర్యమే
పిండమునై యుండగా
నీ కన్నులు నన్ను చూచెను
నీదు హస్తముతో నను నిర్మించితివే

Sagi podhunu agipou nenu సాగి పోదును ఆగి పోను నేను విశ్వాసములో నేను


Song no:
సాగి పోదును - ఆగి పోను నేను

విశ్వాసములో నేను - ప్రార్ధనలో నేడు                       (2X)

హల్లెలూయ హల్లేలూయ - హల్లెలూయ హల్లేలూయ       (2X)

1.        ఎండిన ఎడారి లోయలలో - నేను నడిచినను

కొండ గుహలలో - బీడులలో నేను తిరిగినను                (2X)

నా సహాయకుడు - నా కాపరి యేసే                        (2X)

హల్లెలూయ

2.        పగలెండ దెబ్బకైనను - రాత్రి వేళ భయముకైనా        

పగవాని బానములకైనా - నేను భయపడను                (2X)

నాకు ఆశ్రయము - నా ప్రాణము యేసే                     (2X)

హల్లెలూయ

3.        పదివేల మంది పైబడినా - పదిలముగానే నుండెదను

ప్రభు యేసు సన్నిధానమే - నాకు ఆధారం                 (2X)

నాకు కేడెము - నా కోటయు యేసే                        (2X)

హల్లెలూయ

Jeevama yesayya athmatho nimpuma abhishekinchuma జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా అభిషేకించుమా


Song no:
జీవమా… యేసయ్యా…
ఆత్మతో నింపుమా – అభిషేకించుమా
స్తోత్రము స్తోత్రము యేసయ్యా (3)
స్తోత్రము యేసయ్యా
ఆరాధనా ఆరాధనా ఆరాధనా నీకే (2)      ||జీవమా||

మేడ గది మీద అపోస్తులపై
కుమ్మరించినాత్మ వలె
పరిశుద్ధాగ్ని జ్వాల వలె
నీ ప్రేమను కుమ్మరించుము (2) ||స్తోత్రము||

అనుదినం నీ దివ్య సేవలో
అభిషేకం దయచేయుమా
పలు దిశల సువార్త ప్రకటింప
నీ ఆత్మను కుమ్మరించుము (2) ||స్తోత్రము||