-->

Anamthuda adharinche yesayya akasamandhu అనంతుడా ఆదరించే యేసయ్య ఆకాశమందు నీవు


Song no:

అనంతుడా ఆదరించే యేసయ్య

అనంతుడా ఆదరించే యేసయ్య
ఆకాశమందు నీవు తప్ప నాకు ఇంకెవరూ వున్నారాయ

అనురాగ నిలయుడా ఐశ్వర్యవంతుడా
కనికర పూర్ణుడా నా యేసయ్య

కష్టాల కొలిమిలో నీకిష్టమైన రూపు చేసి
నీ చేతి స్పర్శ తో ప్రతి క్షణము నన్ను ఆదరించి
మహిమ స్వరూపుడా నా చేయి విడువక
అనురాగము నాపై చూపించుచున్నావు

శత్రువు పై సమరములో రథ సారథివై నడిపినావు
నీ నియమాలను నేర్పించి శత్రువును ఓడించినావు
విజయ సమరయోధుడా నాకు జయము నిచ్చి
విజయోత్సవాలతో ఊరేగించుచున్నావు

విడువక నన్ను ప్రేమించే నిజ స్నేహితుడై నిలిచినావు
నీ హస్త బలముతో అగాధాలు దాటించినావు
నీ సన్నిధి కాంతిలో నన్ను తేజరిల్ల చేసి
ఆనంద నగరికై సిద్ధపరచు చున్నావు
Share:

Nee mata naa pataga anukshanam padani నీ మాట నా పాటగా అనుక్షణం పాడనీ


Song no:

నీ మాట నా పాటగా - అనుక్షణం పాడనీ
లోకాన నిను చాటగా - నా స్వరం వాడనీ
నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..
||నీ మాట||

1. ఏ చోట గళమెత్తినా -
నీ ప్రేమ ధ్వనియించనీ
పాడేటి ప్రతి పాటలో - నీ రూపు కనిపించనీ2
వినిపించుచున్నప్పుడే - ఉద్రేకమును రేపక
స్థిరమైన ఉజ్జీవము - లోలోన రగిలించనీ
నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..
||నీ మాట||

2. నీ దివ్య గానామృతం -
జలధారలుగా పొంగనీ
తాకేటి ప్రతి వారినీ -
ఫలవంతముగా మార్చనీ2
శృతిలయలు లోపించక - విసిగింపు కలిగించక
నిజమైన ఉల్లాసమై - నిలువెల్లా కదిలించనీ
నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..
 ||నీ మాట||

3. ఆత్మీయ గీతాలతో -
తనువంతా పులకించనీ
సంగీతమే భోధయై - కనువిప్పు కలిగించనీ2
కాలక్షేపం కోసమే - పరిమితము కాకుండగా
హృదయాల్లో నివసించుచూ -
కార్యాలు జరిగించనీ
నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..
||నీ మాట|| 
Share:

Oka Kshanamaina Neevu Marachina ఒక క్షణమైన నీవు మరచిన నే బ్రతకగలనా యేసయ్యా


Song no:

ఒక క్షణమైన నీవు మరచిన నే బ్రతకగలనా యేసయ్యా

కునికిన నిద్రించిన నా స్థితి ఏమౌనో మెస్సయ్యా (2)

ఒంటరైన వేళలో – జంటగా నేనుందునని

అండ లేని వేళలో – కొండగా నిలుతునని (2)

అభయమునిచ్చిన నా యేసయ్యా

అండగ నిలిచిన నా యేసయ్యా

యేసయ్యా.. యేసయ్యా.. నా యేసయ్యా..         ||ఒక క్షణమైన||



Oka Kshanamaina Neevu Marachina Ne Brathakagalanaa Yesayyaa

Kunikina Nidrinchina Naa Sthithi Emauno Messayyaa (2)

Ontaraina Velalo – Jantaga Nenundunani

Anda Leni Velalo – Kondagaa Niluthunani (2)

Abhayamunichchina Naa Yesayyaa

Andaga Nilichina Naa Yesayyaa

Yesayyaa.. Yesayyaa.. Naa Yesayyaa..          ||Oka Kshanamaina|| 
Share:

Ninne ninne nammukunnanayya నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య నన్ను నన్ను వీడిపోబోకయ్యా


Song no:


నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య
నన్ను నన్ను వీడిపోబోకయ్యా (2)
నువ్వు లేక నేను బ్రతుకలేనయ్య
నీవుంటే నాకు చాలు యేసయ్య (2)           ||నిన్నే||
కన్నుల్లో కన్నీళ్లు గూడు కట్టినా
కన్నవారే కాదని నన్ను నెట్టినా (2)
కారు చీకటులే నన్ను కమ్మినా
కఠినాత్ములెందరో నన్ను కొట్టినా (2)
కఠినాత్ములెందరో నన్ను కొట్టినా            ||నిన్నే||
చేయని నేరములంటకట్టినా
చేతకాని వాడనని చీదరించినా (2)
చీకు చింతలు నన్ను చుట్టినా
చెలిమే చితికి నన్ను చేర్చినా (2)
చెలిమే చితికి నన్ను చేర్చినా                 ||నిన్నే||



Ninne Ninne Nammukunnaanayya
Nannu Nannu Veedipokayyaa (2)
Nuvvu Leka Nenu Brathukalenayya
Neevunte Naaku Chaalu Yesayya (2)      ||Ninne||

Kannulo Kanneellu Goodu Kattinaa
Kannavaare Kaadani Nannu Nettinaa (2)
Kaaru Cheekatule Nannu Kamminaa
Katinaathmulendaro Nannu Kottinaa (2)
Katinaathmulendaro Nannu Kottinaa         ||Ninne||

Cheyani Neramulantakattinaa
Chethakaani Vaadanani Cheedarinchinaa (2)
Cheeku Chinthalu Nannu Chuttinaa
Chelime Chithiki Nannu Cherchinaa (2)
Chelime Chithiki Nannu Cherchinaa           ||Ninne||


Share:

Krupa skhemamu nee saswatha jeevamu కృపా క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు


Song no: 178

కృపా క్షేమము నీ శాశ్వత జీవము
నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు /2/
మహోన్నతమైన నీ ఉపకారములు
తలంచుచు అనుక్షణము పరవశించనా
నీ కృపలోనే పరవశించనా /2/

1. నా ప్రతి ప్రార్ధనకు నీవిచ్చిన ఈవులే
లెక్కకు మించిన దీవెనలైనాయి /2/

అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే
కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను /2/
నీ వాక్యమే మకరంధమై బలపరిచెను నన్ను
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే /2/
ఆరాధన నీకే  /కృపా/

2. నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే
పరిమళింపచేసి సాక్షిగ నిలిపాయి /2/
కలతచెందక నిలిపినది నీ దివ్య దర్శనమే
గమ్యము చేరే శక్తితో నను నింపి నూతన కృపనిచ్చెను /2/
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే /2/
ఆరాధన నీకే     /కృపా /

3.నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా
నా హృది నీ కొరకు పదిలపరచితిని /2/
బూరశబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా
అవధులులేని ఆనందముతో నీ కౌగిలి నే చేరనా /2/
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
ప్రాణేశ్వరా నా యేసయ్య ఆరాధన నీకే /2/
ఆరాధన నీకే /కృపా/
Share:

Kannillatho pagilina gundetho alasina nesthama కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా

కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా
మనసున్న మారాజు యేసుని మదిలో నిలుపుమా  “ 2”
విడువాడు నిన్ను ఎడబాయడు నిన్ను
కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును “ 2”

 1 .రాతిరంతా ఏడుపొచ్చిన కంటనీరు ఆగకుండినా
కాలమింక మారకుండునా వెలుగు నీకు కలుగకుండునా 
ప్రాణమిచ్చి ప్రేమ పంచినా పేరుపెట్టి నిన్ను పిలిచిన
నీ చేయి పట్టి విడచునా అనాధిగా నిన్ను చేయునా  విడువడు నిన్ను

 2.  అంధకారం అడ్డువచ్చినా సంద్రమెంత ఎత్తు లేచినా
నిరాశలే పలకరించిన క్రీస్తు ప్రేమ నిన్ను మరచునా
భాధకలుగు దేశమందునా బంధకాలు వూడకుండునా
శత్రువెంతో పగతో రగిలిన గిన్నె నిండి పొర్లకుండునావిడువాడు నిన్ను
        కన్నీళ్లతో పగిలిన

Share:

Yesayya ne krupa naku chalayya యేసయ్య నీకృప నాకు చాలయ్య నీకృప లేనిదే నే

యేసయ్య! నీకృప నాకు చాలయ్య
నీకృప లేనిదే నే  బ్రతుకలేనయ్యా
నీ కృపలేని క్షణము  నీ దయలేని క్షణము
నేనూహించలేను యేసయ్య ...... "2"
పల్లవి :- యేసయ్య నీకృప నాకు చాలయ్య నీ కృపలేనిదే నేనుండలేనయ్యా ....... 2
మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి
మార్గముగా మారి మనిషిగా మార్చావు
మహినే నీవు మాధుర్యముగ మార్చి
మాదిరి చూపి మరు రూపమిచ్చావు "2"
మహిమలో నేను మహిమను పొంద
మహిమగా మార్చింది - నీ కృప     "2"   యేసయ్య
ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి
ఆపత్కాలమున ఆదుకున్నావు
ఆత్మీయులతో ఆనందింప చేసి
ఆనంద తైలముతో అభిషేకించావు
నా ... ఆశ తీర ఆరాధన చేసె  
అదృష్టమిచ్చింది - నీ కృప   "2"   యేసయ్య
Share:

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Subscribe Us

Comments

Technology

Latest Posts

Recent Posts