ఎంతటి వాడను నేను యేసయ్యా
కొంతైనా యోగ్యుడను కానయ్యా (2)
ఇంతగ నను హెచ్చించుటకు
ఈ స్థితిలో నన్నుంచుటకు (2)||ఎంతటి||
ఐశ్వర్యము గొప్పతనమును
కలిగించు దేవుడవీవే
హెచ్చించువాడవును
బలమిచ్చువాడవు నీవే (2)
అల్పుడను మంటి పురుగును
నన్ను ప్రేమించినావు
ప్రాణమును నీ సర్వమును
నా కొరకై అర్పించినావు ||ఎంతటి||
నిను వెంబడించువారిని
నిజముగ సేవించువారిని
నీవుండే స్థలములలో
నిలిచే నీ సేవకుని (2)
ఎంతో ఘనపరచెదవు
ఆశీర్వదించెదవు
శత్రువుల కంటె ఎత్తుగా
అతని తలను పైకెత్తెదవు ||ఎంతటి||
వినయముగల మనుష్యులను
వర్దిల్లజేసెదవు
గర్విష్టుల గర్వమునణచి
గద్దె నుండి దించెదవు (2)
మాదు ఆశ్రయ దుర్గమా
మేమంతా నీ వారమే
మా శైలము మా కేడెమా
మాకున్నదంతా నీ దానమే ||ఎంతటి||
నా యేసు రాజ్యము అందమైన రాజ్యము
అందులో నేను నివసింతును (2)
సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం
ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం (2) ||నా యేసు||
అవినీతియే ఉండని రాజ్యము
ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం (2)
ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం
ఇక లంచం మోసం మొహం ద్వేషం లేని రాజ్యం (2) ||నా యేసు||
హల్లెలూయా స్తుతులున్న రాజ్యం
యేసే సర్వాధిపతి అయినా సత్య రాజ్యం (2)
ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యం
నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం (2) ||నా యేసు||
నే పాడనా ... నీ ప్రేమ గీతం నే పాడనా ... నీ ప్రేమ గీతం నన్నెంతగానో ప్రేమించిన నీ దివ్య చరితం నీ పాద ధూళినై .... సంకీర్తనా స్వరమునై నే పాడనా ... నీ ప్రేమ గీతం యేసయా - నా యేసయా - సర్వము నీవేనయ ఈ దాసురాలికి*
1. ఆపదల్లో ఉన్ననన్ను ఆప్తుడై ఆదుకుంటివి - నీ ప్రేమను నే రుచి చూసితినీ నశించవలసిన నన్ను వెదకి రక్షించితివీ - నీ క్రుపను నే పొందుకుంటినీ నా కన్నీటి బొట్టు నేల జారక మునుపే - చిరునవ్వై నాట్యమాడుచున్నదీ మహిమ ఘనత నీకే - నా యేసు దేవా
2. ఘోర సిలువను నాకై ధరియించితివి - నిత్య ప్రేమతో నన్ను జయించితివీ నీ అరచేతిలో నన్ను దాచుకుంటివి - నిత్య రక్షణలో నను నడిపించితివీ నేను సైతము నీ ఆత్మ జ్వాలలో - నీ సేవకై నే తపియించితినీ మహిమ నీకే ఘనత నీకే - నా యేసు దేవా
Song no:
నిన్నేగ పుట్టుక నేడంత నడక రెపేమో చితిక మూన్నాళ్ళ బ్రతుకా
భోగాలు కావాలంటు పాదం భూమిని చుట్టేసాక
ఆగాలి ఎదో చోట కాలం మొత్తం పూర్తయ్యాక
నాదంటే నాదనుకుంటు ఏంతో కోంత పోగేసాక
నావెంట వచ్చేదేంటని చూస్తే శున్యం అంతా వెనుక
1 మంచుకు విరిసేటి పువ్వులు మాదిరి కదా ఎండకు వాడాలని అవి సూచించటం లేదా
తేనుందని మురిసే లోగా తుమ్మెద రాదా మాయగా మకరందం పువ్వును విడచిపోదా //2//
బంధం అనుబంధం లోకంతో సంబంధం గాలికి రాలేటి పువ్వులదా ఈ చందం
మాయగా మనిషి నేల రాలి వెళ్లి పోతుంటే || నిన్నేగా ||
2 పువ్వుల సువాసనే మనిషికి పాఠం కాదా నీతిని వెదజల్లాలని నేర్పించుట లేదా
పరిమళ వాసనగా క్రీస్తు బలి కాలేదా ఆ కరుణా హృదయం నీలో ఉందా లేదా ... ఓ ఒ //2//
మాయను నమ్మొద్దు మాయచేసి బ్రతుకొద్దు నీ ప్రశ్నకు లొంగి నిన్ను పొడుచుకోవద్దు
లోతు భార్యవలె వెనుక తిరిగి చూడొద్దు