Uhala kandhanidhi nee dhivya prema ఊహలకందని నీ దివ్య ప్రేమ ఉన్నతమైన ఆ సిలువ ప్రేమ


Song no:
ఊహలకందని నీ దివ్య ప్రేమ
ఉన్నతమైన ఆ సిలువ ప్రేమ
మారనిది మరువనిది
విడువనిది ఎడబాయనిది

1. నా తల్లి నాపై చూపని ప్రేమ
    నా తండ్రి నాకై చేయని త్యాగం
    చూపావు దేవా పశువుల పాకలో
    చేసావు దేవా కలువరి గిరిలో

2. కాలలు మారిన మారని ప్రేమ
    తరాలు మారిన తరగని ప్రేమ
    తరతరములకు నిలిచిన ప్రేమ
    తరగదు ప్రభువా నీ దివ్యప్రేమ

3. కలుషము బాపిన కలువరి ప్రేమ
    కన్నీరు తుడిచె కరుణగల ప్రేమ
    మత్చ్సర పడని ఢంబము లేని
    చిరజీవమిచ్చే ఆ సిలువ ప్రేమ

Yevaru leru yevaru leru ఎవరు లేరు ఎవరు లేరు ఈ లోకంలో


Song no:
ఎవరు లేరు ఎవరు లేరు
ఈ లోకంలో
నీవుతప్ప ఎవరు లేరు
నా యేసయ్యా
నీవు తప్పా -ఆ- నీవు తప్పా...ఆ..
నీవు తప్ప ఎవరు లేరు
నా యేసయ్యా
నీకే వందనమయా
నీకే వందనమయా
నీకే వందనమయా
యేసయ్యా నీకే వందనమయా

1. కంట తడి పేట్టకని ఓదార్చితివే
    కౌగిలిలో దాచుకొంటివే
    కరుణతో నన్ను హత్తుకుంటివే
    నీ అక్కున నను చేర్చుకుంటివే

2. భయమేలనూ అని
    అభయము నిచ్చి
    ధైర్యముతో నను నింపితివే
    సహాయకుడా విమోచకుడా
    నను నడిపించిన నా యేసయ్యా

Yesayya naa pranamu naa pranamu యేసయ్యా నా ప్రాణము నాప్రాణము నీదేనయ్యా


Song no: 15
యేసయ్యా నా ప్రాణము నాప్రాణము నీదేనయ్యా
నా యేసయ్యా
నాకున్న సర్వము నీదేనయా
నాదంటు ఏది లేనే లేదయా

1. నా తల్లి గర్భమున నేనున్నపుడే
    నీ హస్తముతో నను తాకితివే
    రూపును దిద్ది ప్రాణము పొసి
    నను ఇల నిలిపిన
    నా యేసయ్యా

2. బుద్దియు జ్ఞానము
    సర్వ సంపదలు
    గుప్తమైయున్నవి నీ యందే
    జ్ఞానము నిచ్చి ఐశ్వర్యముతో
    నను ఇల నడిపిన నాయేసయ్యా

1. లోకములో నుండి ననువేరు చేసి
    నీదు ప్రేమతో ప్రత్యేక పరచి
    అభిషేకించి ఆశీర్వదించి
    నను ఇల మలచిన
     నా యేసయ్యా  

Mahima chellinthunu yesuke మహిమ చెల్లింతును యేసుకి మహిమ చెల్లింతును


Song no:
మహిమ చెల్లింతును
యేసుకి మహిమ చెల్లింతును
మహిమ మహిమ
మహిమ మహిమ యేసయ్యకే

1. కుంటి వారికి నడకను నేర్పెను
    గ్రుడ్డి వారికి చూపును ఇచ్చిన
    మూగ వారికి మాటను ఇచ్చిన
    యేసయ్యాకే
    మహిమ చెల్లింతును

2. మరణము నుండి                  తిరిగలేచిన
మహిమ రాజ్యమును                                     సిద్ధపరచిన
మరల మాకై రానైయున్న              యేసయ్యాకే 
మహిమ చెల్లింతును

Madhi nindi anadham pogguchunnadhi మది నిండి ఆనందం పొంగుచున్నది నా మనసంతా


Song no:
మది నిండి ఆనందం
పొంగుచున్నది
నా మనసంతా
నీ రూపము నిండియున్నది

1. పరవశించి పాడానా
    నిన్ను కొనియాడనా
    నిత్యము నీలోనె ఉండాలని
    నా ప్రాణమా నా ఆశ్రయమా

2. మనోహర స్థలములలో
    పాలు ప్రాప్తించెను
    శ్రేష్టమైన స్వాస్ధ్యము
    నాకు కలిగెను
    నాస్వాస్ధ్యమా   
    నాపానీయా బాగమా
 
3. జీవమార్గమును
    నీవు నాకు చూపితివి
    యేసు నీ సన్నిధిలో సంతోషమే
    నా జీవమా నా ఆనందమా

Bhayame ledhule dhigule ledhule భయమేలేదులే దిగులే లేదులే యేసయ్యా తోడు వుండగా


Song no:
భయమేలేదులే దిగులే లేదులే
యేసయ్యా తోడు వుండగా
కంటతడి లేదులె కన్నీరే లేదులె
యేసు నా ప్రక్కనుండగా
హల్లెలూయ ఆమేన్ హల్లెలూయా
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా

ఆదరించు దేవుడు నా యేసయ్యా ఆశ్రయమిచ్చు దేవుడు
నా యేసయ్యా
ఆదరించును ఆశ్రయమిచ్చును
నిరంతరం తన రెక్కలో
నను దాయును

బలమిచ్చు దేవుడు నా యేసయ్యా జయమిచ్చు దేవుడు నా యేసయ్యా బలమిచ్చును నాకు జయమిచ్చును
నిరంతరం తన కృపలో నడిపించును

స్వస్ధపరచు దేవుడు నా యేసయ్యా
నిత్య జీవమిచ్చు దేవుడు
నా యేసయ్యా స్వస్థపరచును
నిత్య జీవమిచ్చును
నిరంతరం తనలోనే నను దాయును

Junte thene dharalukanna madhuramainadhi జుంటి తేనె ధారలకన్న మధురమైనది మంచి గోధుమ పంటకన్న తియ్యనైనది


Song no: 128
జుంటి తేనె ధారలకన్న మధురమైనది
మంచి గోధుమ పంటకన్న తియ్యనైనది
నీ మాటలు శ్రేష్టమైనవి
నా జిహ్వకు మధురమైనది

ఉదయమునే నీ మాటలు ధ్యానించగా నా హృదయము
నాలో ఉప్పొంగుచుండెను అనుభవించితిన్ నీదు సన్నిధిన్ ఆనందితును నీ సన్నిధిలో

నా పాదములకు దీపమయెను
నా బాధలో నెమ్మది కలుగజేసెను తొట్రిల్లనియ్యక కాపాడుచుండెను
నీ మార్గములోనే నన్ను నడుపుచుండెను

నీ పాదాములే నాకు శరణమయెను నీ సన్నిధియె నాకు పెన్నిదాయెను
నీ మాటలే నాకు ప్రాణమాయెను ద్యానమాయెను
స్తుతి గానమాయెను