Nuvve lekapothey nenemaipodhuno నువ్వే లేకపోతే నేనేమైపోదునో నువ్వే రాకపోతే నేనెక్కడ వుందునో


Song no:
నువ్వే లేకపోతే నేనేమైపోదునో
నువ్వే రాకపోతే నేనెక్కడ వుందునో
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా

నీ శక్తితో నింపు నీ బలముతో నింపు
బహు ప్రజలను
నీకై నే సంపాదించుటకు

ఆత్మతో నింపు అభిషేకముతో నింపు
నశియించే నీ ప్రజలను
నీలో నడుపుటకు

ప్రేమతో నింపు నీ జీవముతో నింపు
అనుదినము నిన్ను నే
స్తుతియించుట కొరకు

Yesu neetho naa jeevitham యేసు నీతో నా జీవితం ఎల్ల వేళలందు ఆనందమే


Song no: 55
యేసు నీతో నా జీవితం
ఎల్ల వేళలందు ఆనందమే
ఆరాధింతును అనుదినము
ప్రణుతింతును ప్రతి దినము

రాజుల రాజువని ప్రభువుల ప్రభువని
నీవు లేక ఏది కలుగలేదని
కీర్తింతును నిను కొనియాడెదన్ ద్యానింతును నీలో దినదినము

సర్వోన్నతుడని
సర్వశక్తి మంతుడవని
సమస్తానికి ఆదారము నీవని
పూజింతును నిను ఘనపరచెదన్
జీవింతును నీకై ప్రతిదినము

Madhuramaina nee prema మధురమైన నీ ప్రేమా మరపురాని కరుణా కురిపించితివి


Song no: 56
మధురమైన నీ ప్రేమా
మరపురాని కరుణా
కురిపించితివి నీ కృప నాపై
మరిపించితివి ఈ లోక ప్రేమ

పలువురు నన్నుచూచి పరిహసించినా
పదివేల మంది నాపై పడివచ్చినా
పదిలముగానే ఉండేదనయా
పరిశుద్ధుడా యేసు నీ సన్నిధిలో

నాకున్నవారే నిందించినా
నాకయినవారే నన్ను విడిచినా
విడువలేదు నన్ను మరువలేదు నీవు
మరపురానిదే నీ దివ్య ప్రేమ

నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే
చావైన నాకు ఎంతో మేలు
చనిపోవు చుంటిని
దిన దినము నాలో
జీవించుచుంటిని
సిలువ ప్రేమ నీడలో

Nee prema naku yentho madhuramainadhi నీ ప్రేమ నాకు ఎంతో మధురమైనది నీ ప్రేమ నాకు ఎంతో శ్రేష్టమైనది


Song no: 58
నీ ప్రేమ నాకు ఎంతో మధురమైనది
నీ ప్రేమ నాకు ఎంతో శ్రేష్టమైనది
మధురమైనది నీ ప్రేమ
మరపురానిది నీ ప్రేమ

భయపడగా నే కృంగి యుండగా
పడియుండగా నే చేడి యుండగా
చెంత చేరినది నీ ప్రేమ
చేర దీసినది నీ ప్రేమ

నిను విడిచి నే దూరమవ్వగా
వ్యర్ధమైనది నే కోరుకొనగా
వెంబడించినది నీ ప్రేమ
నన్ను మార్చినది నీ ప్రేమ

Sarvyadhi kariyaina devudu సర్వాధి కారియైన దేవుడు సమస్తము ఎరిగియున్న దేవుడు


Song no: 57
సర్వాధి కారియైన దేవుడు సమస్తము ఎరిగియున్న దేవుడు
సమృద్ధిగిచ్చువాడు సంతోషమిచ్చువాడు
సకలము తెలుసు నా యేసుకే
సర్వము సాధ్యము నా యేసుకే

సృష్టికి రూపమే లేనప్పుడు
శూన్యములో నుండి సృష్టిని తీశాడు
సృష్టికి ఆకారము నిచ్చాడు దేవుడు
సృష్టికి అందాలను ఇచ్చాడు దేవుడు

సృష్టిలో మానవునీ పెట్టాడు
తన పోలిక రూపమును ఇచ్చాడు
ఫలియించి అభివృద్ధి
చెందమని చెప్పాడు
ఈ సృష్టినంత మీరే
ఏలమని అన్నాడు

Mahonnathudavu neeve prabhu మహోన్నతుడవు నీవె ప్రభూ మహాఘనుడవు


Song no: 59
మహోన్నతుడవు నీవె ప్రభూ
మహాఘనుడవు నీవె ప్రభూ
ఓ ప్రభూ నీ కార్యముల్ వివరించనా
నా ప్రభూ నీ నామమున్ స్తుతియించనా

పరిశుద్ధ శౌర్యమును
బలమైన కార్యములు
కానాను యాత్రలో కనపరచావు
అరణ్యములో త్రోవను
ఎడారిలో ఉటలు
ఎన్నెన్నో కార్యములు నీవు చేసినావు

నీ మహిమ కార్యములు
మహోన్నత ప్రభావములు
కానా పెండ్లిలో కనపరచావు
ఖాళీయైన బానలు
క్రొత్తదైన ద్రాక్షరసం
మధురముగా పుట్టించి
మహిమ చూపినావు

Neeve neeve stuthulapai aasinuda నీవే నీవే స్తుతులపై ఆశీనుడా నీకె నీకే నా హృదయ సింహసనం


Song no: 61
నీవే నీవే స్తుతులపై ఆశీనుడా నీకె నీకే నా హృదయ సింహసనం
ఉన్నవాడ అనువాడ స్తోత్రం
రానున్నవాడ రాజులరాజా స్తోత్రం
నీకె మహిమ నీకే స్తోత్రం
నీకె ఘనతా ప్రభావములు

ఆకాశము భూమియు గతియించినా
నీ మాటలు గతియింప నేరవంటివే
స్థిరమైనవి బహు విలువైనవి
ఘనమైనవి నీ మాటలు

ఈ లోక ప్రేమలన్ని తరిగి పోయినా
మార్పులేని ప్రేమను చూపించితివే
మధురమైనది నను మార్చుకున్నది
శాశ్వతమైనది నీ ప్రేమయే