Prabhuva naa prardhana alakinchuma ప్రభువా నా ప్రార్ధన ఆలకించుమా దేవా నా మొట్ట


Song no:
ప్రభువా నా ప్రార్ధన ఆలకించుమా
దేవా నా మొట్ట నీ సన్నిధికి చేరనీయుమా
ప్రభువా నా ప్రార్ధన ఆలకించుమా
దేవా నా మొట్ట నీ సన్నిధికి చేరనీయుమా


కారుచీకటి వేళలో నా దారి కానక పోయెనే
నమ్మిన ఆ స్నేహమే నన్ను ఒంటరినిగా చేసెనే
కాదననని ప్రేమకై నిన్ను చేరితినయ్యా
కాదననని ప్రేమకై నేనిన్ను చేరితినయ్యా
ప్రభువా నా ప్రార్ధన ఆలకించుమా
దేవా నా మొట్ట నీ సన్నిధికి చేరనీయుమా


మరపురాని నిందలే నా గాయములను రేపెనే
మదిలో నిండిన భయములే నన్ను కృంగదీసెనే
మరువలేని ప్రేమకై నిన్ను చేరితినయ్యా
నన్ను మరువలేని ప్రేమకై
నేనిన్నుచేరితినయ్యా
ప్రభువా నా ప్రార్ధన ఆలకించుమా
దేవా నా మొట్ట నీ సన్నిధికి చేరనీయుమా

నేను చేసిన పాపమే
నాకు శాపమై మిగిలెనే
నాదు దోష కార్యములే
నన్ను నీకు దూరము చేసెనే
నన్ను మన్నించే ప్రేమకై
నిన్ను చేరితినయ్యా
నన్ను మన్నించే ప్రేమకై
నేనిన్ను చేరితినయ్యా
ప్రభువా నా ప్రార్ధన ఆలకించుమా
దేవా నా మొట్ట నీ సన్నిధికి చేరనీయుమా
ప్రభువా నా ప్రార్ధన ఆలకించుమా
దేవా నా మొట్ట నీ సన్నిధికి చేరనీయుమా

Anni sadyame yesuku anni అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే


Song no:
అన్నీ సాధ్యమే
యేసుకు అన్నీ సాధ్యమే (2)
అద్భుత శక్తిని నెరపుటకైనా
ఆశ్చర్య కార్యములొసగుటకైనా (2)
యేసు రక్తానికి
సాధ్యమే సాధ్యమే సాధ్యమే (2) ||అన్నీ సాధ్యమే||

మాధుర్యమైన జలముగామారాను ప్రభు మార్చెను
మృత్యువు నుండి లాజరునుమాహిమార్థముకై లేపెను (2)
మన్నాను కురిపించగాఆకాశమే తెరిచెను
మరణాన్ని ఓడించగామృత్యుంజయుడై లేచెను (2) ||అన్నీ సాధ్యమే||

బండనే చీల్చగాజలములే పొంగెను
ఎండిపోయిన భూమిపైఏరులై అవి పారెను (2)
బందంటే క్రీస్తేననినీ దండమే తానని
మెండైన తన కృపలోనీకండగా నిలచును (2) ||అన్నీ సాధ్యమే||

ఏకాంతముగా మోకరిల్లిప్రార్ధించుటే శ్రేయము
ఏల నాకీ శ్రమలనిపూర్ణ మనసుతో వేడుము (2)
యేసయ్య నీ వేదనఆలించి మన్నించును
పాటి వ్యధలైననూ సిల్వలో తీర్చును (2) ||అన్నీ సాధ్యమే||

కష్టాల కడలిలోకన్నీటి లోయలో
కనికరమే ప్రభు చూపునుకంటిపాపలా కాయును (2)
కలిగించు విశ్వాసముకాదేదీ అసాధ్యము
క్రీస్తేసు నామములోకడగండ్లకే మోక్షము (2) ||అన్నీ సాధ్యమే||

Naku chalinadhi nee prema నాకు చాలినది నీ ప్రేమ నన్ను విడువనిది నీ కృప


Song no: 17
నాకు చాలినది నీ ప్రేమ
నన్ను విడువనిది నీ కృప
ఎత్తుకొని ముద్దాడి
భుజముపై నను మోసి
ఎత్తుకొని హత్తుకొని
నీ ఓడిలో చేర్చిన నీ ప్రేమ

1. దూరమైన నన్ను
    చేరదీసె నీ ప్రేమ
    చెరగని నీ ప్రేమతో సేద దీర్చిన
    కంట నీరు పెట్టగా
    కరిగి పొయె నీ హృదయం
    కడలిలోన కడవరకు
    ఆదరించె నీ ప్రేమ

2. పడియున్న నన్ను చూచి
    పరితపించె నీ ప్రేమ
    పరమువీడి భూవికరుదెంచి
    ప్రాణ మిచ్చిన
    ఎంత ప్రేమ యేసయ్య
    ఎంత జాలి నాపైన
    నీ ప్రేమ ఇంత అంతని
    వివరించలేనయా

Yesayya naa pranamu naapranamu యేసయ్యా నా ప్రాణము నాప్రాణము నీదేనయ్యా


Song no: 15
యేసయ్యా నా ప్రాణము నాప్రాణము నీదేనయ్యా
నా యేసయ్యా
నాకున్న సర్వము నీదేనయా
నాదంటు ఏది లేనే లేదయా

1. నా తల్లి గర్భమున నేనున్నపుడే
    నీ హస్తముతో నను తాకితివే
    రూపును దిద్ది ప్రాణము పొసి
    నను ఇల నిలిపిన
    నా యేసయ్యా

2. బుద్దియు జ్ఞానము
    సర్వ సంపదలు
    గుప్తమైయున్నవి నీ యందే
    జ్ఞానము నిచ్చి ఐశ్వర్యముతో
    నను ఇల నడిపిన నాయేసయ్యా

1. లోకములో నుండి ననువేరు చేసి
    నీదు ప్రేమతో ప్రత్యేక పరచి
    అభిషేకించి ఆశీర్వదించి
    నను ఇల మలచిన
     నా యేసయ్యా  

Uhalakandhani nee dhivya prema ఊహలకందని నీ దివ్య ప్రేమ ఉన్నతమైన ఆ సిలువ ప్రేమ


Song no: 13
ఊహలకందని నీ దివ్య ప్రేమ
ఉన్నతమైన ఆ సిలువ ప్రేమ
మారనిది మరువనిది
విడువనిది ఎడబాయనిది

1. నా తల్లి నాపై చూపని ప్రేమ
    నా తండ్రి నాకై చేయని త్యాగం
    చూపావు దేవా పశువుల పాకలో
    చేసావు దేవా కలువరి గిరిలో

2. కాలలు మారిన మారని ప్రేమ
    తరాలు మారిన తరగని ప్రేమ
    తరతరములకు నిలిచిన ప్రేమ
    తరగదు ప్రభువా నీ దివ్యప్రేమ

3. కలుషము బాపిన కలువరి ప్రేమ
    కన్నీరు తుడిచె కరుణగల ప్రేమ
    మత్చ్సర పడని ఢంబము లేని
    చిరజీవమిచ్చే ఆ సిలువ ప్రేమ

Bhariyinchalenayya ee vedhana భరియించలేనేసయ్యా ఈ వేదన సహియించలేనేసయ్యా ఈ శోధన


Song no: 12
భరియించలేనేసయ్యా ఈ వేదన సహియించలేనేసయ్యా ఈ శోధన
ఎందాక ఈ వేదన ఎందాక ఈశోధన

అందరితో వెలివేయ బడినా
కొందరితో దూషించబడినా
నాకెవ్వరు ఉన్నరయ్యా నీవేనయ్యా

ప్రాణానికి ప్రాణమని చెప్పిన
వారెవరు నా తోడు లేరు
నాతోడు నీవేనయా నాయేసయ్యా

నా ప్రాణము నీవేనయా
నాసర్వము నీవేనయా నీవుంటే నాకు చాలయా నా యేసయ్యా

Nimittha mathrudanu nirmanakudavu nivayya నిమిత్త మాత్రుడను నేనయ్యా నిర్మాణకుడవు నీవయా


Song no: 11
నిమిత్త మాత్రుడను నేనయ్యా
నిర్మాణకుడవు నీవయా
నిర్మించినావు నీదు రూపులో
ప్రేమించినావు ప్రాణముకన్న

ఎంత భాగ్యమయ్యా
నాకెంత భాగ్యము
ఎంత ధన్యతయ్యా నాకెంత ధన్యత

1. నాశనకరమగు
    గుంట నుండియు
    జిగటగల దొంగ ఊబి నుండియు
    లేవనెత్తినావు యేసయ్యా
    నన్ను నిలబెట్టినావు మెస్సియ్యా
 
2. చీకటిలో నుండి వెలుగులోనికి
    మరణములో నుండి
    జీవములోనికి
    నను దాటించినావు యేసయ్యా
    నను నడిపించినావు మెస్సియ్యా

3. బలహీనుడనైన
    నన్ను బలపరచావు
    ఆత్మతో అభిషేకించి     
    నడిపించావు
    నీ మహిమతో నను   
    నింపిపినావయా నీ పాత్రగ
    నను మలచినావయా