Sthothrarpana sthuthi arpana స్తోత్రార్పణా స్తుతి అర్పణ చెల్లించుడీ యేసుకే భజియించుడీ యేసునే


Song no: 10
స్తోత్రార్పణా స్తుతి అర్పణ
చెల్లించుడీ యేసుకే
భజియించుడీ యేసునే
ఆయనే - యోగ్యుడు
ఆయనే - ఆర్హుడు

1. సర్వ సృష్టికి ఆది సంభూతుడు
    సమస్తమునకు ఆదారభూతుడు
    వాక్యమై యున్న యేసయ్యా
    సృష్టి కాదారము యేసయ్యా
 
2. సమీపింపరాని తేజస్సు నందు
    నిరతము వశియించు
    అమరుండు యేసే
    వెలుగుగ యున్న యేసయ్యా
    వెలిగింప వచ్చెను యేసయ్యా

3. మానవాళికి మోక్ష ప్రధాత
    సర్వ పాప విమోచకుడు
    మార్గమై ఉన్నాడేసయ్యా
    జీవమై ఉన్నాడేసయ్యా

Neevunte naku chalani నీవుంటే నాకు చాలని నీవుంటే నాకు మేలని


Song no: 9
నీవుంటే నాకు చాలని
నీవుంటే నాకు మేలని
అనుదినము అనుక్షణము
నిన్నే కొరెద
ప్రతిదినము ప్రతిక్షణము
నిన్నె చేరెద

1. బంధువులు త్రోసివేసిన
    స్నేహితులు దూరమైన
    విడువని నీ స్నేహమే
    చాలు యేసయ్యా
    మరువని నీ బంధమే
    నాకు మేలయ్యా

2. శ్రమలెన్నో ఎదురైన
    శోధనలు నను చుట్టినా
    జయమిచ్చిన నీ కృపయే
    చాలు యేసయ్యా
    విడిపించిన నీ తోడె
    నాకు మేలయా

Mahima chellinthunu yesuniki మహిమ చెల్లింతును యేసుకి మహిమ చెల్లింతును


Song no: 8
మహిమ చెల్లింతును
యేసుకి మహిమ చెల్లింతును
మహిమ మహిమ
మహిమ మహిమ యేసయ్యకే

1. కుంటి వారికి నడకను నేర్పెను
    గ్రుడ్డి వారికి చూపును ఇచ్చిన
    మూగ వారికి మాటను ఇచ్చిన
    యేసయ్యాకే
    మహిమ చెల్లింతును

2. మరణము నుండి                  తిరిగలేచిన
మహిమ రాజ్యమును                                     సిద్ధపరచిన
మరల మాకై రానైయున్న              యేసయ్యాకే 
మహిమ చెల్లింతును

Sakala vedhasaram neevenayya సకల వేదసారం నీవేనయ్యా నీ ప్రేమ మాధుర్యం


Song no: 7
సకల వేదసారం నీవేనయ్యా
నీ ప్రేమ మాధుర్యం
పాడెద మనసారా

1. వేద శ్లోకాలలో
    వ్రాయబడిన ప్రకారం
    మాకై రక్తమంత కార్చితివే
    మమ్ము శుద్ధులుగా చేసితివే
    మాకు రక్షణ నిచ్చితివే

2. ఖురాన్ గ్రంధములో
    వ్రాయబడిన ప్రకారం
    పరిశుద్ధ కూమారునిగ           
    నీవు వుంటివే
    కన్యక గర్భమందు పుట్టితివె
    ఆత్మ ద్వార కలిగితివే

3. పరిశుద్ధ గ్రంధములో
    వ్రాయబడిన ప్రకారం
    కృపా సత్య సంపూర్ణునిగ
    నీవు వుంటివే
    మాకై మరణించి లేచితివే
    మోక్ష రాజ్యం నొసగితివె
    మరల మాకై రానైయుంటివె

Nee padhapai padiyunna నీ పాదాలపై పడియున్న పుష్పమును యేసయ్యా


Song no: 6
నీ పాదాలపై పడియున్న
పుష్పమును యేసయ్యా
నీ చేతితో నను తాకుమా
పుష్పించెద ఫలియించెద
యేసయ్యా...యేసయ్యా...ఆ..ఆ

1. వాడిపొయిన పువ్వును నేను
    వాడుకొనుటకు పనికిరానయా
    నీ స్పర్శ చాలును యేసయ్యా
    నీ చూపు చాలును యేసయ్యా
    పుష్పించెదా ఫలియించెదా
    సువాసననే వెదజల్లెదా

2. మోడు బారిన నా జీవితమును
    నీదు ప్రేమతో చిగురింప జేయా
    నీ శ్వాస చాలును యేసయ్యా
    నీ నీడ చాలును యేసయ్యా
    చిగిరించెద ఫలియించెదా
    నీ సాక్షిగానే జీవించెదా

Alpudaina naa korakai nee ishwaryamunu అల్పుడనైన నా కొరకై నీ ఐశ్వర్యమునే విడచితివా


Song no: 5
అల్పుడనైన నా కొరకై నీ ఐశ్వర్యమునే విడచితివా
పాపినైన నాకొరకై నీ
ప్రాణమునె అర్పించితివా

1.కెరూబులతో సెరపులతో
   నిత్యము నిన్నె పొగడచుండు
   పరిశుద్ధుడు పరిశుద్ధుడని
   ప్రతిగానములతో స్తుతియించె
   మహిమనే నీవు విడచితివా

2. సుందరులలో అతి 
    సుందరుడవు
    వేల్పులలోన ఘనుడవు నీవు
    ఎండిన భూమిలో మొక్క వలె
    సొగసు సురూపము విడచితివా
    దాసుని రూపము దాల్చితివా

Ninnu chudalani ninne cheralani నిన్ను చూడాలని నిన్నే చేరాలని నీతోనే కలిసి నడవలని


Song no: 3
నిన్ను చూడాలని నిన్నే చేరాలని నీతోనే కలిసి నడవలని
ఆశ నాలో కలుగుచున్నదయా

1. నీతో కలసి నడచినపుడు
    నాదు అడుగులు తడబడలేదె
    నా త్రోవకు వెలుగుగ
    నీవే ఉండాలని
    నీ అడుగు జాడలో
    నేను నడవలని

2. నీదు ముఖమును చూచినపుడు
    నాకు నిత్యము సంతోషమే
    నీ ముఖ కాంతిలో
    నే హర్షించాలని
    నీదు రూపులో నేను మారాలని

3. నీ సన్నిధినే చేరినపుడు
    నిత్యము నీలో పరవశమే
    పరిశుద్ధులతో స్తుతియించాలని
    నీదు మహిమలో           
    ఆనందించాలని