vuhinchaleni melulatho nimpina ఊహించలేని మేలులతో నింపినా నా ఏసయ్యా


Song no: o
ఊహించలేని మేలులతో నింపినా 
నా ఏసయ్యా నీకు నా వందనము } 2
వర్ణించగలనా నీ కార్యముల్ 
వివరించగలనా నీ మేలులన్ } 2 ||ఊహించలేని||

1. మేలులతో నా హ్రుదయం త్రుప్తిపరచినావు 
రక్షణా పాత్రనిచ్చి నిన్ను స్తుతియింతును } 2 
ఇస్రయేలు దేవుడా నా రక్షకా 
స్తుతియింతునూ నీ నామమును  } 2 ||ఊహించలేని||

2. నా దీనస్తితిని నీవు మార్చినావు 
నా జీవితానికి విలువనిచ్చినావు } 2
నీ క్రుపతో నన్ను ఆవరించినావు 
నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు  } 2 ||ఊహించలేని||


Ooohinchaleni melulatho nimpina
Naa Yesayyaa Neeke Naa Vandanam
Varninchagalanaa Nee Kaaryamul
Vivarinchagalanaa Nee Melulan

1. Melutho Naa Hrudayam Thrupthiparachinaavu
Rakshana Paathranichchi Ninu Sthuthiyinthunu
Israyelu Devudaa Naa Rakshakaa
Sthuthiyinthunu Nee Naamamun

2. Naa Deenasthithini Neevu Maarchinaavu
Naa Jeevithaaniki Viluvanichchinaavu
Nee Krupaku Nannu Aahvaninchinaavu

Nee Sannidhi Naaku Thodunichchinaavu

Nithya jeevadhipathi yesu నిత్య జీవాదిపతి యేసు నీకే వందనం


Song no:
నిత్య జీవాదిపతి యేసు నీకే వందనం }2


ఆదియు నీవే  అంతము నీవే
త్రియేక దేవా యేసయ్య వందనం } 2 || నిత్య||


సర్వ శక్తి సర్వాంతర్యామి
ఘనమైన దేవా యేసయ్య } 2 || నిత్య||

Online Lyrics List



Padhamulu chalani prema iedhi పదములు చాలని ప్రేమ ఇది

Track
Song no:

పదములు చాలని ప్రేమ ఇది
స్వరములు చాలని వర్ణనిది (2)
కరములు చాపి నిను కౌగలించి పెంచిన
కన్నవారికంటే ఇది మిన్నయైన ప్రేమ
వారిని సహితము కన్న ప్రేమ
ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ
ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ
కలువరి ప్రేమ         ||పదములు||

నవ మాసం మోసి ప్రయోజకులను చేసినా
కన్నబిడ్డలే నిను వెలివేసినా (2)
తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు
నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ
వేదనంత తొలగించును ప్రేమ      ||ప్రేమ||

మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన
స్నేహితులే హృదయమును గాయపరచగా (2)
మేలులతో నింపి అద్భుతములు చేసి
క్షమియించుట నేర్పించెడి ప్రేమా
శాంతితో నిను నడిపించెడి ప్రేమ       ||ప్రేమ||



Padamulu Chaalani Prema Idi
Swaramulu Chaalani Varnanidi (2)
Karamulu Chaapi Ninu Kougalinchi Penchina
Kannavaarikante Idi Minnayaina Prema
Vaarini Sahithamu Kanna Prema
Prema Idi Yesu Prema
Prema Idi Thandri Prema
Prema Idi Praanamichchina Prema
Kaluvari Prema            ||Padamulu||

Nava Maasam Mosi Prayojakulanu Chesinaa
Kannabiddale Ninu Velivesinaa (2)
Thana Karamulu Chaapi Mudimi Vachchu Varaku
Ninneththukoni Aadarinchu Prema
Aa Vedanantha Tholaginchunu Prema         ||Prema||

Melulenno Pondi Unnatha Sthithikedigina
Snehithule Hrudayamunu Gaayaparachaga (2)
Melulatho Nimpi Adbhuthamulu Chesi
Kshamiyinchuta Nerpinchedi Premaa
Shaanthitho Ninu Nadipinchedi Prema         ||Prema||



Rajulaku rajanta prabhuvulaku prabhuvanta రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట

Song no:
రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట
బెల్లేహేము పురములోన పుట్టెనంట
సూడసక్కనోడంట పశులపాకలోనంట
దావీదు కుమారుడంట లోక రక్షకుడంట
కనులారా. ఓహెూ కనులారా.
ఆహా. కనులారా సూద్దాము రారండి బాలయేసుని
మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని


పాపమంత బాపునంట దోషమంత మాపునంట
కరుణశీలుడు ఆ యేసు కనికరించె దేవుడంట 2
ఇమ్మానుయేలుగ తోడుండునంట సిన్ని యేసయ్య
ఎన్నడు విడువక ఎడబాయడంట మంచిమెస్సయ్య 2


జ్ఞానులంత జూచిరంట గొల్లలంత గూడిరంట
బాలయేసు పాదచెంత చేరి స్తుతియించారంట
బంగారు సాంబ్రాణి బోళములతో ఘనపరిచినారంట

దివిలోన దూతలు పరిశుద్దుడంటూ కొనియాడినారంట

Rajulaku rajanta prbhuvulaku prabhuvanta 
Bethlehem puramulona puttenanta
Sudasakkanodanta pashuvula pakalonanta
Dhaveedhu kumarudanta loka rakshakudanta 
Kanulara... Oho kanulara..
Aha.. Kanulara suddhamu rarandi balayesuni
Manasara koniyada serandi chinni yesuni 


Papamantha bapunanta dhosamantha mapunanta
Karunasheludu aa yesu kanikarinche devudanta  -2
Iemmanuyeluga thodundunanta chinni yesayya 
Yennadu viduvaka yedabayadanta manchi yesayy.  -2


Gynanulantha juchiranta gollalantha gudiranta 
Balayesu padhachentha cheri sthuthiyincharanta
Bangaru sambrani bolamulatho ghanaparichinaranta

Divilona dhuthalu parishuddhudantu koniyadinaranta

Siluvalo nakai chesina yagamu maruvalenayya సిలువలో నాకై చేసిన యాగము మరువలేనయ్యా

Song no:

సిలువలో నాకై చేసిన యాగము
మరువలేనయ్యా మరచిపోనయ్యా

నీ ప్రేమను… నీ త్యాగమును…

మరువలేనయ్యా నీ ప్రేమను
మరచిపోనయ్యా నీ త్యాగము } 2
సిలువలో నాకై చేసిన యాగము } 2 || మరువలేనయ్యా ||

పుట్టినది మొదలు పాపిని నేను
పెరిగినది ఈ బ్రతుకు పాపములోనే } 2
పాపినైనా నను ప్రేమించితివి } 2
పాపములోనుండి విడిపించితివి } 2 || మరువలేనయ్యా ||

నా కోసమే నీవు జన్మించితివి
నా కోసమే నీవు సిలువనెక్కితివి } 2
నా కోసమే నీవు మరణించితివి } 2
నా కోసమే నీవు తిరిగి లేచితివి } 2
|| మరువలేనయ్యా ||

ఎవరూ చూపని ప్రేమను చూపి
ఎవరూ చేయని త్యాగము చేసి } 2
విడువను ఎడబాయను అన్నావు } 2
నీ నిత్యజీవమును నాకివ్వగోరి } 2 || మరువలేనయ్యా ||

Siluvalo Naakai Chesina Yaagamu
Maruvalenayyaa Marachiponayyaa

Nee Premanu… Nee Thyaagamu…

Maruvalenayyaa Nee Premanu
Marachiponayyaa Nee Thyaagamu (2)
Siluvalo Naakai Chesina Yaagam (2)        ||Maruvalenayyaa||

Puttinadhi modhalu papini nenu
periginadhi ee brathuku papamulone } 2
papinaina nanu preminchithivi } 2
papamulonenundi vidipinchithivi } 2      ||Maruvalenayyaa||

Naa Kosame Neevu Janminchithivi
Naa Kosame Neevu Siluvanekkithivi (2)
Naa Kosame Neevu Maraninchithivi (2)
Naa Kosame Neevu Thirigi Lechithivi (2)        ||Maruvalenayyaa||

Evaru Choopani Premanu Choopi
Evaru Cheyani Thyaagamu Chesi (2)
Viduvanu Edabaayanu Annaavu (2)
Nee Nithyajeevamunu Naakivvagori (2)        ||Maruvalenayyaa||


Krupa sathya sampurnuda naa yesayya కృప సత్యసంపూర్ణుడ నా యేసయ్య


Song no:
కృప సత్యసంపూర్ణుడ నా యేసయ్య      }
నిన్ను పాడి పొగడెదనయ్య నజరేయుడా }2
నజరేయుడా నా గలలీయుడా  2
నజరేయుడా నాదు గలలీయుడా
                                            ॥కృపా సత్య ॥
1
వాక్య ప్రణవ రూపమా దివ్య లోక తేజమ      }
దివి వీడి భువికరుదెంచిన మహిమ రూపమా }2
దినమెల్ల పాడిన వేనోళ్ల పొగడినా  }
నా ఆశ తీరదు నా దైవమా            }2
॥నజరేయుడా॥                       ॥కృపా సత్య॥
2
అత్యున్నత శిఖరముపై ఆరాధ్యుడవు నీవు  }
ఆశతీర నీదు కొలిచెదను ఆత్మరూపుడా       }2
ఆదరణ కర్త నీవై నన్నాదరించావు   }
ఆత్మాభిషేకముతో బలపరచినావు  }2
॥నజరేయుడా॥                       ॥కృపా సత్య॥
3
నిత్యుడైన దేవుడవు నీతి స్వరూపుడవు }
నిన్న నేడు ఏకరీతిగ ఉన్నవాడవు           }2
నీ ప్రేమ చాటగా మనసార పాడగా  }
నా బాష చాలదు నా దైవమా         }2
॥నజరేయుడా॥                       ॥కృపా సత్య॥